For Money

Business News

NIFTY TRADE: పడితే కొనొచ్చా…

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,076. ఇవాళ నిఫ్టి స్వల్ప నష్టంతో ప్రారంభం కానుంది. నిఫ్టికి 17,120 కీలక స్థాయి కానుంది. ఇక్కడ ఒత్తిడి ఎదురు కావొచ్చు. ఈ ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగితే 17140 ప్రాంతంలో గట్టి ప్రతిఘటనకు అవకాశముంది. ఏ కారణం చేతనైనా నిఫ్టి ఈ స్థాయికి వస్తే అమ్మొచ్చు. 15 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అమ్మండి. రిస్క్‌ తీసుకునేవారు 17,120 ప్రాంతంలో అమ్మొచ్చు. నిఫ్టి వీక్‌గా ఉంటే ఆ పనిచేయండి. నిఫ్టి బలహీనంగా ఉంటే నిఫ్టి 17,000 ప్రాంతంలో మద్దతు లభింవచ్చు. ఈ స్థాయికి వస్తే 16,985 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటే 16960 దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి తొందరపడి కొనుగోలు చేయొద్దు. సో.,,, ఇవాళ్టికి నిఫ్టి రేంజ్‌ 16,960 నుంచి 17,140 మధ్య ఉండొచ్చు.