నిఫ్టికి ఇదే తొలి సపోర్ట్
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో టర్నోవర్ పెద్దగా లేదు. కొన్ని ఏఐ టెక్ షేర్లు మినహా మిగిలిన షేర్లు స్థిరంగా ముగిశాయి. ఉదయం నుంచి స్వల్ప లాభాల్లో ఆసియా మార్కట్లు ఉన్నాయి. ఈనేపథ్యంలో మన మార్కెట్లు కూడా స్థిరంగా ప్రారంభం కానున్నాయి. కొత్త సిరీస్లో పలు కీలక మార్పులు ఉన్నాయి. నిఫ్టి నిన్న 25938 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ నిఫ్టి పెరిగితే 25975 లేదా 26000 ప్రాంతంలో రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ నిఫ్టి 26000 స్థాయిని దాటితే 26200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక నిఫ్టిలో ఒత్తిడి వచ్చే పక్షంలో 50 DEMAకీలకం కానుంది. 25850 నుంచి 25900 మధ్య ప్రాంతంలో నిఫ్టికి మద్దతు లభించే అవకాశముంది.
