2 రోజుల్లో రూ. 15,000 జంప్
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అనుకున్నట్లే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించడంతో వెండి పరుగులు తీసింది. బంగారం ధర కేవలం అర శాతం పెరగ్గా, వెండి ధర మాత్రం రాత్రి మూడు శాతం పెరిగింది. దీంతో మన మార్కెట్లో వెండి అదే స్థాయిలో పెరిగింది. నిన్న రూ. 11500 పెరిగిన కిలో వెండి ధర ఇవాళ మరో రూ. 3500 పెరిగింది. దీంతో రెండు రోజుల్లో వెండి ధర రూ. 15000 పెరగడం విశేషం. ప్రస్తుతం MCXలోకిలో వెండి రూ. 1, 92,246 ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో రూ. 2,10,000 దాటినట్లు బులియన్ మర్చంట్స్ అంటున్నాయి. ముఖ్యంగా చెన్నై, ఢిల్లీ మార్కెట్లలో వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం కన్నా… వెండిలో అధిక ట్రేడింగ్ జరుగుతోంది.
