లాభాలు నిలిచేనా?
ఇవాళ స్టాక్ మార్కెట్ గ్రీన్‌లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. గిఫ్ట్ నిప్టి లాభాలు 65 నుంచి 100 పాయింట్ల మధ్య ఉంటోంది. ఈ ఊగిసలాట మధ్య నిఫ్టి ప్రారంభం కానుంది. నిఫ్టి కనీసం వంద పాయింట్లు లాభపడటమే గాకుండా… లాభాలను చివరి వరకు నిలుపుకుంటేనే మార్కెట్ నిలబడుతుంని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టి గనుక క్రితం ముగింపు స్థాయిని కోల్పోతే మాత్రం భారీ నష్టాలు తప్పవని, నిఫ్టి 25700 స్థాయికి చేరినా ఆశ్చర్యపోనక్కలేదని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టి గనుక 25950 ప్రాంతంపైన నిలబడితే మరో 300 పాయింట్ల ర్యాలీకి ఛాన్స్ ఉందని
టెక్నికల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ సెంటిమెంట్ బాగా బలహీనంగా ఉండటం ఆందోళన కల్గిస్తోంది. రోజూ ఏదో ఒక రంగానికి చెందిన షేర్లపై ఒత్తిడి వస్తోంది. మెటల్స్, ఐటీ మినహా ఇతర రంగాలేవీ నిఫ్టికి అండగా నిలవడం లేదు. బ్యాంక్ నిఫ్టి ఒక రోజు లాభాలు, మరో రోజు నష్టాల్లో ఉంటోంది. ఇక బ్యాంక్ నిఫ్టిపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పనిలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టికి ఐటీ, మెటల్స్‌తో పాటు ఏ రంగాలు అండగా నిలబడుతాయో చూడాలి.
