టాటా నుంచి టిగోర్ ఈవీ
టాటా మోటార్స్.. టిగోర్ ఎలక్ట్రిక్ కారు (ఈవీ)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మూడు వేరియంట్లలో తీసుకువచ్చిన ఈ కారు బేసిక్ మోడల్ ధర రూ.11.99 లక్షలు. వేరియంట్‌ను బట్టి ధర మారుతుంది. డ్యూయల్ టోన్ టాప్ ఎండ్ ధర రూ.13.14 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. కంపెనీ తీసుకువచ్చిన రెండో ఎలక్ట్రిక్ కారు టాటా టిగోర్. కంపెనీ ఇప్పటికే నెక్సాన్ ఈవీని విక్రయిస్తోంది. ఒకసారి చార్జింగ్‌తో ఈ కారు 306 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి ఈ కారుకు 4 స్టార్ రేటింగ్ ఉంది. ఇప్పటి వరకు టాటా మోటార్స్ 8,500 ఎలక్ట్రిక్ వాహనాలను టాటా మోటార్స్ విక్రయించింది.