స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు అరశాతంపైగా నష్టంతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ 93పై స్థిరంగా ఉంది. క్రూడ్ రాత్రి భారీగా క్షీణించినా ఇపుడు గ్రీన్లో ఉంది. అయితే దీనికి భిన్నంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్ కాంగ్ మార్కెట్లు గ్రీన్లో ఉండగా, జపాన్ నిక్కీ నష్టాల్లో ఉంది. సింగపూర్ నిఫ్టి నామమాత్రపు లాభాలతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.