For Money

Business News

NIFTY TRADE: పైస్థాయిలో ఒత్తిడి

ఇవాళ సెప్టెంబర్‌ డెరివేటివ్స్‌ ప్రారంభమౌతాయి. నిన్న రోలోఓవర్స్‌ సాధారణ స్థాయిలో ఉన్నాయి. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,974 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. దేశీయ ఆర్థిక సంస్థలు కేవలం రూ.1,055 కోట్లు నికర అమ్మకాలు చేశాయి. ఇవాళ కూడా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగే అవకాశముంది. అక్టోబర్‌ నుంచి ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు ఉపసంహరించే అవకాశముందని ఫెడ్‌ అధికారులు చెబుతున్న నేపథ్యంలో డాలర్‌ బలపడుతోంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 16,636. టెక్నికల్‌ ఇవాళ పెద్ద హెచ్చుతగ్గులు లేవు. నిఫ్టి క్షీణింస్తే 16590 ప్రాంతంలో మద్దతు లభిస్తుందేమో చూడండి. లేకుంటే నేరుగా 16,570కి చేరొచ్చు. 16,550 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొద్దు. ఒకవేళ నిఫ్టి గనుక పెరిగితే 16,640 కీలక స్థాయి. ఈ స్థాయిని దాటితే 16,680 దాకా వెళ్ళొచ్చు. టెక్నికల్‌గా ఆల్గో ట్రేడింగ్‌ రేంజ్‌ 16,590-16,680 మధ్య ఉంది. స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయండి. షేర్ల ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కాని ఆప్షన్‌ మార్కెట్‌లో ప్రీమియం బాగా తగ్గే అవకాశముంది.