పబ్లిక్ ఇష్యూకి ఫ్రీడమ్ ఆయిల్
‘ఫ్రీడమ్’ బ్రాండ్‌తో వంట నూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎ్‌ఫఐఎల్) పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు సెబీకి ప్రాస్పెక్టస్ సమర్పించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్ ద్వారా ఇపుడు కంపెనీలో ఉన్న ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయిస్తారు. కంపెనీ తాజాగా ఎటువంటి ఈక్విటీని జారీ చేయదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిసా, కర్ణాటక రాష్ట్రాల్లో 640 పట్టణాల్లో ‘ఫ్రీడమ్’ బ్రాండ్‌తో వంట నూనెలను కంపెనీ అమ్ముతోంది. ఉత్తరాదిలో కంపెనీ విస్తరించాలని భావిస్తోంది.