For Money

Business News

ఫిన్‌టెక్‌ వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా

ఫిన్‌టెక్‌ సంస్థలైన లేజీపే, ఇండియాబుల్స్‌ హోమ్‌ లోన్‌, కిస్త్‌ వంటి వెబ్‌సైట్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. చైనా సహా పలు ఇతర దేశాల కంపెనీలు నిర్వహిస్తున్న 232 యాప్‌లను కూడా కేంద్రం బ్లాక్‌ చేసిందని సమాచారం. బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, అనధికార రుణ సేవలను అందిస్తున్నందున ఈ యాప్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘దేశ ఆర్థిక భద్రతకు విఘాతం కలిగించే, అక్రమ మార్గాల్లో నగదు బదిలీ కార్యకలాపాలను సాగిస్తున్న 138 బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్లు; 94 అనధికార రుణ యాప్‌లు ఈ జాబితాలో ఉన్న’ట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. buddyloan.com, cashtm.in, kreditbee.en.aptoide.com, faircent.com, true-balance.en.uptodown.com తదితర వెబ్‌సైట్లపై నిషేధం విధించారు.