For Money

Business News

వొడాఫోన్‌లో మెజారిటీ వాటా ప్రభుత్వానిదే

బకాయిలకు బదులు ఈక్వీటీ కేటాయించడంతో వోడాఫోన్‌లో కేంద్ర ప్రభుత్వానికి వాటా దక్కిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.16,133 కోట్ల విలువైన బకాయిలకు గాను కంపెనీ ఈక్విటీ షేర్ల కేటాయించింది. ఈ మేరకు వొడాఫోన్‌ ఐడియా బోరర్డు ఆమోదం తెలిపింది. రూ.10 ముఖ విలువ కలిగిన 1613,31,84,899 షేర్లను ప్రభుత్వానికి జారీ చేసేందుకు వొడాఫోన్‌ ఐడియా బోర్డు అంగీకరించింది. ఈ కేటాయింపుతో కంపెనీలో 33.44 శాతం ఈక్విటీతో కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. కంపెనీ నిర్ణయానికి సంబంధించిన వార్త మొన్ననే మార్కెట్‌లో వైరల్‌ కావడంతో వోడాఫోన్‌ షేర్‌ భారీగా పెరిగింది. కంపెనీ నిర్ణయం తరవాత నిన్న 4 శాతం దాకా నష్టపోయి రూ 7.95 వద్ద ముగిసింది.