2023లో టెస్లా షేర్ ధర రెట్టింపు?
టెస్లా షేర్ ఇటీవల భారీగా క్షీణించింది. నిన్న 11 శాతం పైగా క్షీణించి 109 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్కెట్లో పోటీ పెరగడం, చైనాలో ఇబ్బందులు కారణంగా 2023లో కూడా టెస్లా వాహనాలకు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. పలు రకాల భయాలు, అంచనాలతో టెస్లా షేర్ భారీగా క్షీణించిందని.. అయితే 2023లో షేర్ ‘బెస్ట్ ఐడియా ఫర్ 2023’ అని మార్కెట్ అనలిస్ట్ బెయిర్డ్ అన్నారు. ఎలాన్ మస్క్ కూడా 2023లో తన షేర్లను అమ్మకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అంటే షేర్ల లిక్విడిటీ పెరగదన్నమాట. అలాగే 2023లో ట్విటర్‌కు సంబంధించిన తలనొప్పులు కూడా తొలిగిపోతాయని భావిస్తున్నారు అనలిస్టులు. 109 డాలర్ల వద్ద ఉన్న ఈ షేర్ తొలుత 316 డాలర్లకు చేరుతుందని అంచనా వేయగా… ఇపుడు కాస్త తగ్గించి 252 డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. అంటే ప్రస్తుత ధర నుంచి 130 శాతం అధికమన్నమాట. ఆస్టిన్, బెర్లిన్‌లో ఉన్న గిగా ఫ్యాక్టరీస్ మార్జిన్లు 2023లో పెరుగుతాయని.. బెర్లిన్‌లో వారానికి 3000 వాహనాల తయారీ సామర్థ్యానికి కంపెనీ చేరుకుంటుందని… బెయిర్డ్ అంటున్నారు. స్వల్ప కాలానికి, దీర్ఘకాలానికి కూడా ఈ షేర్ మంచి పెట్టుబడి అవకాశమని పేర్కొన్నారు.