For Money

Business News

స్మార్ట్‌ మీటర్ల తయారీలో అదానీ

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2026కల్లా 25 కోట్ల స్మార్ట్‌ మీటర్లను అమర్చాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించనట్లు వెల్లడించింది. అంతే.. ఈ రంగంలో కూడా అదానీ గ్రూప్‌ ప్రవేశించింది. ఇందుకోసం బెస్ట్‌ స్మార్ట్‌మీటరింగ్‌ లిమిటెడ్‌ (BSML) పేరిట ఓ కంపెనీని నెలకొల్పింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌కు ఇది పూర్తిగా వంద శాతం అనుబంధ కంపెనీ. ఇపుడు ఉన్న విద్యుత్‌ మీటర్ల స్థానంలో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్‌వ్యవస్థీకరణ పథకం (RDSS) తెచ్చింది. ఈ పథకం కింద 23 రాష్ట్రాల పరిధిలోని 40 డిస్కమ్‌లకు 17.34 కోట్ల ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు, 49.02 లక్షల డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌మిషన్‌ మీటర్లు, 1.68 లక్షల ఫీడర్‌ మీటర్లు అమర్చుతారు.