For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

రోజంతా పలుమార్లు లాభనష్టాలతో దోబూచులాడిన నిఫ్టి స్థిరంగా ముగిసింది. వంద పాయింట్లు అటూ ఇటూ కదలాడిన నిఫ్టి 18122 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 10 పాయింట్ల నష్టంతో ముగిసింది.బ్యాంక్‌ నిఫ్టి రెడ్‌లో ముగిసినా నష్టాలు చాలా తక్కువ. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు మాత్రం గ్రీన్‌లో ముగిశాయి. నిన్న 18000 కాల్‌, పుట్స్‌లో భారీ రైటింగ్‌ ఉన్నందున సూచీలో పెద్ద కదలికలు లేవు. ఇవాళ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ డేటా రావాల్సి ఉంది. చిత్రంగా ఉదయం టాప్‌ గెయినర్స్‌గా ఉన్న పలు షేర్లు… క్లోజింగ్‌కల్లా టాప్‌ లూజర్స్‌లో చేరడం విశేషం. చాలా వరకు మెటల్‌ షేర్లది అదే పరిస్థితి. నిఫ్టితో పాటు ఇతర సూచీలు దాదాపు స్థిరంగా ఉన్నట్లు కన్పిస్తున్నా… చాలా వరకు షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం నుంచి టైటాన్‌ స్టార్‌ షేర్‌గా నిలిచింది. నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ టోటల్‌ ఏకంగా ఏడు శాతంపైగా లాభంతో ముగిసింది. అలాగే పేటీఎంను పలు బ్రోకరేజీ సంస్థలు రెకమెండ్‌ చేస్తున్నాయి. ఈ షేర్‌ కూడా ఇవాళ 4 శాతంపైగా లాభపడింది. మిడ్‌ క్యాప్‌ పీఎస్‌యూ బ్యాంకుల్లో లాభాలు కొనసాగాయి. అయితే దాదాపు అన్ని ప్రైవేట్‌ బ్యాంకులు నష్టాలతో ముగియడం ఇవాళ్టి విశేషం.