For Money

Business News

జనవరిలో కరోనా విజృంభణ?

పొరుగు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 40 రోజులు మనదేశానికి అత్యంత కీలకమని ఆరోగ్య శాఖలోని అధికారులు భావిస్తున్నారు.
2020 మార్చ్ లో కరోనా ప్రారంభమైన తరువాత.. వరుసగా వచ్చిన వేవ్‌లను పరిశీలించిన అధికారులు.. భారత్‌లో కొత్త వేవ్ జనవరిలో వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. గతంలో వచ్చిన ట్రెండ్‌ను పరిశీలిస్తే… ఈసారి కూడా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వీరు అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా వేరియంట్‌తో జరిగినంతగా విధ్వంసం ఇకపై జరగకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ తో కేసుల సంఖ్య పెరిగినా… కోవిడ్ వ్యాధి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా కేసుల ఉధృతి చూసిన తరవాత రాష్ట్రాలను అలర్ట్‌గా ఉండాల్సిందిగా కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ బీఎఫ్ 7 చాలా వేగంగా ఇతరులకు విస్తరిస్తుందని… ఒక వ్యక్తికి ఈ వైరస్‌ సోకితే… మరో 16 మందికి సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.