ఢిల్లీ లిక్కర్ స్కామ్… కవిత పేరు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అమిత్ అరోరా అనే వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరుతూ… రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఏడు రోజులు రిమాండ్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను ఈడీ పేర్కొన్నారు. ఇందులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవిత గురించి ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత రెండు ఫోన్ నంబర్లను పది ఫోన్లలో వాడినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.ఈ రెండు ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. కవిత, శరత్‌చంద్రా రెడ్డి, శ్రీనివాసరెడ్డి.. పౌత్ గ్రూప్‌ను నియంత్రించారని ఈడీ తెలిపింది. లైసెన్స్‌లు పొందేందుకు వీరు ముడుపులు చెల్లించినట్లు ఈడీ పేర్కొంది.ఫోన్లు మార్చిన వారిలో శరత్ రెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, సృజన్‌రెడ్డిలు ఉన్నారని ఈడి తెలిపింది.సృజన్‌రెడ్డి 3, అభిషేక్ బోయినపల్లి 5, బుచ్చిబాబు 6, శరత్ చంద్రారెడ్డి 9 ఫోన్లు మార్చినట్లు పేర్కొంది.