స్థిరంగా సింగపూర్ నిఫ్టి
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. రాత్రి అమెరికా మార్కెట్ చాలా ఉత్సాహంగా ముగిసింది. వరుసగా వస్తున్న కంపెనీల ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉండటంతో ర్యాలీ కొనసాగుతోంది. రాత్రి దాదాపు అన్ని సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి.మార్కెట్లు ముగిసిన తరవాత వెలువడిన ఫలితాలు కూడా ఆకర్షణీయంగా ఉండటంతో సూచీలు దాదాపు ఒక శాతం లాభంతో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లతో సంబంధం ఉన్న జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి మార్కెట్లు లాభాల్లో ఉండగా… చైనా, హాంగ్ కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. లాభాలు అర శాతంపైగా ఉండగా… నష్టాలు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయి. ఒక్క హాంగ్‌సెంగ్ మాత్రం0.72 శాతం నష్టంతో ఉంది. ఇక సింగపూర్ నిఫ్టి 30 పాయింట్ల లాభంతో ఉంది. సో.. నిఫ్టి పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.