For Money

Business News

కొనసాగుతున్న ర్యాలీ

వాల్‌స్ట్రీట్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.82 శాతం లాభంతో ట్రేడవుతోంది. వాల్‌స్ట్రీట్‌లో అత్యధికంగా డౌజోన్స్‌ 0.67 శాతం లాభంతో ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.52 శాతం, నాస్‌డాక్‌ 0.33 శాతం లాభంతో ఉన్నాయి. ఇవాళ డాలర్ స్వల్పంగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 112పైన ఉంటోంది. అలాగే పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ కూడా 4 శాతంపైనే ఉన్నాయి. దీంతో ఈ వాల్‌స్ట్రీట్‌ చివరిదాకా గ్రీన్‌లో ఉంటుందా? లేదా లాభాలు స్వీకరిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఎనర్జీ షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. భారీ డిమాండ్‌ ఉండకపోవచ్చనే వార్తలతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్‌ 90 డాలర్ల దిగువకు వచ్చేసింది.