For Money

Business News

భారీ లాభాల్లో సింగపూర్ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ వచ్చింది. రాత్రి వాల్‌స్ట్రీట్‌లో అన్ని సూచీలు రెండున్నర శాతంపైగా లాభంతో ముగిశాయి. టెస్లా రాత్రి 8 శాతంపైగా క్షీణించింది. లేకుంటే నాస్‌డాక్‌ మరింత పెరిగేది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్లో ఉన్నాయి. దాదాపు అన్నీ రెండు శాతంపైగా లాభంతో ఉన్నాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లకు ఇవాళ సెలవు. సింగపూర్ నిఫ్టి 200 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. సో.. నిఫ్టి కూడా 17000పైన ప్రారంభమయ్యే అవకాశముంది.