ఢిల్లీ మద్యం కేసు: విజయ్ నాయర్ అరెస్ట్
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ (38)ను ఇవాళ అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇతను అత్యంత సన్నిహిత వ్యక్తి. ఈనెల 6వ తేదీన విజయ్ నాయర్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇండో స్పిరిట్‌కు మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేందు నుంచి అరుణ్ రామచంద్ర పిళ్ళై ముడుపులు తీసుకున్నారని, వాటిని విజయ్ నాయర్ ద్వారా ప్రజా ప్రతినిధులుకు ఇచ్చారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
విచారణకు వచ్చి…
ఇప్పటి వరకు విజయ్ నాయర్ విదేశాల్లో ఉన్నారు. ఇవాళ ప్రశ్నించడానికి తమ కార్యాలయానికి రావాలని విజయ్ నాయర్‌ను సీబీఐ ఆదేశించింది. ఉదయం నుంచి విచారించిన తరవాత అతన్ని అరెస్ట్ చేసింది. ముంబైకి చెందిన వోన్లీ మచ్ లౌడర్ అనే కంపెనీకి ఇతను గతంలో సీఈఓగా పనిచేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.