అర శాతం పెంపు
ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీ రేట్లను మరోమారు పెంచింది రిజర్వు బ్యాంకు. అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువగా రెపో రేటును 0.5 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 5.4శాతానికి చేరింది. రెపో రేటు ఇపుడు కొవిడ్ ముందు స్థాయికి చేరింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజులు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించిన ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను ప్రకటించారు.