NIFTY LEVELS: 17476 దాటితేనే
ఇవాళ మార్కెట్ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17388. సింగపూర్ నిఫ్టిని చూస్తే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17400 స్థాయిని దాటనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. మన దేశంలో కూడా ఈ స్థాయి ర్యాలీ కొనసాగాలంటే నిఫ్టి 17476 స్థాయిని దాటాల్సి ఉంది. 17450 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి వచ్చి లేదా లాభాలు స్వీకరించినా.. నిఫ్టి స్వల్పంగా క్షీణించవచ్చు. అయితే ఏమాత్రం పడినా కొనుగోలుకు ఛాన్స్‌గా భావించవచ్చు. అయితే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. అలాగే రేపు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కచ్చితం లెవల్స్‌ను చూసుకుంటూ పొజిషన్స్‌ను ఇవాళ క్లోజ్ చేయడం మంచిది.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 17506
రెండో నిరోధం – 17476
తొలి నిరోధం – 17456
నిఫ్టికి కీలకం – 17340
తొలి మద్దతు – 17321
రెండో మద్దతు – 17301
డౌన్ బ్రేకౌట్ – 17271