రిలయన్స్ బిడ్‌కు బూట్స్ నో
రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫార్మా రిటైల్ బిజినెస్ సంస్థ `బూట్స్యూకే`ను టేకోవర్ చేయాలన్న ముకేశ్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. బూట్స్ మాతృ సంస్థ అయిన అమెరికా రిటైల్ మేజర్ వాల్‌గ్రీన్స్ బూల్స్ అలయెన్స్… బూట్స్‌ను అమ్మాలన్న ప్రతిపాదనను విరమించకుంది. బూట్స్ యూకేను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయెన్స్ వెల్లడించింది. దీంతో బూట్స్ యూకేను టేకోవర్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వేసిన బిడ్‌ను తిరస్కరించింది. దీనిపై రిలయన్స్ వర్గాలు స్పందిస్తూ.. విదేశాల్లో మంచి అవకాశాలు లభిస్తే, ఆయా సంస్థల కొనుగోలుపై మున్ముందు కూడా దృష్టి సారిస్తామని పేర్కొన్నాయి. బూట్స్ యూకే టేకోవర్ చేయడానికి థర్డ్ పార్టీ చేసిన ఆఫర్ నిరాశాజనకంగా ఉందని వాల్‌గ్రీన్స్ బూట్స్ పేర్కొంది.