For Money

Business News

అపోలో హాస్పిటల్స్‌ నుంచి క్లినకల్‌ ఫెలోషిప్‌

అపోలో ఇంటర్నేషనల్ క్లినికల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ( ఔసీఎఫ్పీ)-2022ను అపోలో హాస్పిటల్స్ గ్రూపునకు చెందిన అపోలో ఎడ్యుకేషన్ యూకే ప్రారంభించింది. బ్రిటన్‌కు చెందిన గ్లోబల్‌ ట్రైనింగ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్, రైటింగ్టన్, విగన్ అండ్ లీహ్ NHS టీచింగ్ హాస్పిటల్స్, ఎడ్జ్ హిల్ యూనివర్సిటీ- యూకే తో కలిసి ఈ ప్రొగ్రామ్‌ను అందిస్తోంది. ఈ ఫెలోషిప్‌ కోసం మనదేశానికి చెందిన వైద్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎస్ / ఎండీ / DnB పూర్తిచేసిన వైద్యులు దీనికి అర్హులు. యూకేలోని ఎడ్జ్ హిల్ యూనివర్సిటీలో సర్జరీ అండ్ మెడిసిన్లో మూడేళ్ల మాస్టర్స్ డిగ్రీ చదివే అవకాశం లభిస్తుంది. ఈ ప్రోగ్రాము ఎంపికైన వైద్యులు మొదటి ఏడాది మనదేశంలోని అపోలో హాస్పిటల్స్ పనిచేయాల్సి ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల్లో యూకేలోని NHS హాస్పిటల్స్‌లో చదువు కుంటూ పని చేయాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన తరవాత ఎడ్జ్‌ హిల్‌ యూనివర్సిటీ డాక్టర్లకు MCh/MMed డిగ్రీని ప్రదానం చేస్తుంది.