15850పైన నిఫ్టి… నిలబడుతుందా?
సింగపూర్ నిఫ్టి కన్నా మెరుగ్గా ప్రారంభమైంది నిఫ్టి. ఓపెనింగ్‌లోనే 15863ని తాకిన నిఫ్టి ఇపుడు 15847వద్ద ట్రేవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 150 పాయింట్ల లాభంతో ఉంది. సెన్సెక్స్ 534 పాయింట్లు పెరిగింది. నిఫ్టి నెక్ట్స్ మాత్రమే 0.8 శాతం లాభంతో ఉంది. నిఫ్టితో సహా మిగిలిన అన్ని సూచీలు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. రిలయన్స్ ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. బజాజ్ ట్విన్‌్ ఇవాళ కూడా పెరిగాయి. క్రూడ్ ధరలు తగ్గడంతో ఓఎన్‌జీసీ నిఫ్టి టాప్ లూజర్‌గా నిలిచింది. ఆటో షేర్లలో మారుతీ, అశోక్ లేల్యాండ్ ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీలోని 25 షేర్లు లాభాల్లో ఉన్నాఇ. ఇక బ్యాంక్ నిఫ్టిలో బంధన్ బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలిచింది.
