For Money

Business News

లాభాలన్నీ పాయే…

ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు ఊహించినట్లే నిఫ్టి ఆకర్షణీయ లాభాల్లో నుంచి నష్టాల్లోకి జారుకుంది ఉదయం 15863ని తాకిన నిఫ్టి ఇపుడు 15,619కి చేరింది. దాదాపు 250 పాయింట్లు క్షీణించిందన్నమాట. నిఫ్టితో పాటు నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. బలహీనంగా ఉన్న చాలా షేర్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టిలో 40 షేర్లు నష్టాల్లో ఉండగా, 10 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఈ లాభాలు కూడా నామ మాత్రంగానే ఉన్నాయి. నిఫ్టి తొలి మద్దతు 15648 వద్ద ఉంగా, రెండో మద్దతు 15636 వద్ద ఉంది. ఈ రెండో స్థాయిలకు దిగువకు వచ్చిన నిఫ్టి డౌన్‌ బ్రేకౌట్‌ స్థాయి 15619ని తాకి ఇపుడు మళ్ళీ 15635 వద్ద ట్రేడవుతోంది. మరి ఇక్కడి నుంచి నిఫ్టి కోలుకుంటుందా అన్నది పూర్తిగా యూరో మార్కెట్లపై ఆధారపడి ఉంది.