కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచాలని అమెరికా ఫెడ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను కుదిపేస్తోంది. ఫెడ్ నిర్ణయం తరవాత గ్రీన్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లోకి రావడంతో ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి పెరిగింది.ఆసియా మార్కెట్లలో ఒక్క హాంగ్కాంగ్ మార్కెట్ మూడు శాతం నష్టంతో ముగిసింది. అమెరికాలో లిస్టయిన చాలాషేర్లు భారీగా నష్టపోయాయి. ఇక మన మార్కెట్ విషయానికొస్తే ఆరంభంలో 15863 స్థాయికి చేరిన నిఫ్టి మిడ్ సెషన్ కల్లా 15392కి పడిపోయింది. అంటే 450 పాయింట్లకు పైగా క్షీణించింది. యూరో మార్కెట్లు కూడా ఒకటిన్నర శాతం పడటంతో మన మార్కెట్లు రెండు శాతం క్షీణించాయి. నిఫ్టి మిడ్ క్యాప్ , నిఫ్టినెక్ట్స్ సూచీలు రెండున్నర శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టిలో ఒక్క బ్రిటానియా తప్ప మరో షేర్ లాభపడలేదు. వడ్డీ రేట్లు పెంచడంతో ఆర్థికవృద్ధిపై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో మెటల్ సేర్లు భారీగా క్షీణించాయి. అలాగే ఐటీ షేర్లు కూడా.
