పడితే కొనుగోలు చేయండి
మార్కెట్ ఇవాళ లాభాలతో ప్రారంభమైనా… కొద్దిసేపటి తరవాత స్వల్ప కరెక్షన్ వస్తుందని.. ఆ స్థాయిలో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అంటున్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని. గత కొన్ని రోజుల నుంచి నిఫ్టి కాల్స్ కొనుగోలు చేయమని ఆయన సలహా ఇచ్చారు. ఇవాళ మార్కెట్ లాభాల్లో ప్రారంభమౌతుందని.. ఇది వరకే కొన్నవారు తమ పొజిషన్స్‌ను కొనసాగింవచ్చని… ఇప్పటి వరకు కొనుగోలు చేయనివారు వారు ఇవాళ కరెక్షన్ సమయంలో కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. అయితే కచ్చితంగా స్టాప్‌లాస్‌ను మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు. ఫెడరల్ రిజర్వ్ 0.75 శాతం చొప్పున వడ్డీ పెంచినందున నిఫ్టికి ఒత్తిడి కూడా రావొచ్చు. కాబట్టి నిఫ్టి కాల్స్ కొనేవారు కచ్చితంగా స్టాప్‌లాస్ ఉంచుకోవాలని సుదర్శన్ సుఖాని స్పష్టం చేశారు. ఇక షేర్లలో దివీస్ ల్యాబ్‌ను కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు.
