ఆరంభ లాభాలు ఔట్
వాల్స్ట్రీట్లో గ్రీన్లో కొనసాగుతోంది. ఆరంభంలో ఒక శాతంపైగా లాభంతో ఉన్న సూచీలు ఇపుడు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.33 శాతం లాభంతో ఉండగా, డౌజోన్స్ 0.1 శాతం లాభంతో ఉంది. ఐటీ, టెక్ షేర్లలో ఉత్సాహం లేదు. మరోవైపు నకిలీ ఖాతాలు ఎన్ని ఉన్నాయో చెప్పకపోతే ట్విటర్ డీల్ నుంచి వైదొలుగుతానని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్చరించారు. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా పెరిగి 102 దాటింది. క్రూడ్ ఆయిల్ మాత్రం 120 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బులియన్లో పెద్ద మార్పు లేదు.అయితే వెండి ఒక శాతం లాభంతో ఉంది.