For Money

Business News

73 డాలర్లకు చేరువలో క్రూడ్‌

అమెరికా ఆర్థికవృద్ధి రేటును కాపాడేందుకు అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ డాలర్‌ను కంట్రోల్‌ చేస్తోంది. అయినా డాలర్‌ పెరుగుతోంది. సాధారణంగా డాలర్‌ పెరిగితే తగ్గాల్సిన క్రూడ్‌ పెరుగుతూనే ఉంది. ఒపెక్‌ దేశాలు తమ ఉత్పత్తిని పెంచరాదని నిర్ణయించడంతో క్రూడ్‌ స్థిరంగా ఉండేది. అనేక దేశాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుతోంది. ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. ముఖ్యంగా యూరప్‌లో ఆంక్షలు ఎత్తివేయడంతో క్రూడ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. అలాగే ఈసారి అమెరికా వేసవిలో క్రూడ్‌ డిమాండ్‌ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రూడ్‌ భారీగా పెరుగుతోంది. ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ కాస్సేపటి క్రితం 72.82కు చేరింది. అమెరికా మార్కెట్‌ క్రూడ్‌ 70 డాలర్లు దాటడంతో సెంటిమెంట్‌ మరింత మెరుగైంది. ఇవాళ రాత్రికి అమెరికా వారాంతపు క్రూడ్‌ నిల్వల డేటా వెల్లడి కానుంది. ఒకవేళ ఈ డేటా మార్కెట్‌కు అనుకూలంగా ఉంటే… 75 డాలర్లకు చేరడం ఖాయంగా కన్పిస్తోంది.