For Money

Business News

15,900పైన నిఫ్టి… అమ్మడానికి ఛాన్స్‌

ప్రతి రోజూ ‘బై ఆన్‌ డిప్స్‌’ పని చేస్తోంది. ఇవాళ కూడా అదే ఫార్ములా పనిచేస్తోందా అన్నది చూడాలి. ఎందుకంటే ఫెడ్‌ నిర్ణయం కోసం ప్రపంచ మార్కెట్లన్నీ ఎదురు చూస్తున్నాయి. డాలర్‌, క్రూడ్‌… ఫెడ్‌ను కూడా పునరాలోచనలో పడేస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. సో… రేపటి ఫెడ్‌ నిర్ణయం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపొచ్చు. ఆ ప్రభావం పాజిటివ్‌గా లేదా నెగిటివ్‌గా ఉండొచ్చు. మన మార్కెట్లు మాత్రం రోజూ కాస్త లాభంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 15,869. నిఫ్టి ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 15,830 ప్రాంతంలో రావొచ్చు. రిస్క్‌ తీసుకునేవారు 15,810 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. మిడ్‌ సెషన్‌లోగా కోలుకుంటే స్వల్ప లాభాలతోనైనా బయటపడింది. నిఫ్టి గనుక 15,860పైన నిలదొక్కుకుంటే మాత్రం ఇవాళ 15,900ని తాకొచ్చు. టెక్నికల్‌ నిఫ్టికి ఇది తొలి ప్రతిఘటన. ఒకవేళ ఈ స్థాయికి నిఫ్టి వస్తే 15,920 దాటుతుందేమో చూడండి. ఇక్కడ బలహీనంగా ఉంటే 15,935 స్టాప్‌లాస్‌తో అమ్మండి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,910 ప్రాంతంలోనే అమ్మొచ్చు. 15,930 దాటితే మార్కెట్‌ జోలికి వెళ్ళొద్దు. అలాగే దిగువస్థాయిలో కొనుగోలు చేసేవారు నిఫ్టి 15,800-15,830 రేంజ్‌ను చాలా జాగ్రత్తగా గమనించండి. 15,800 దిగువకు వెళితే.. మార్కెట్‌కు దూరంగా ఉండండి. ఇప్పటికే అమ్మేసినవారు 15,770 వరకు వెయిట్‌ చేయొచ్చు. 15,800-15,900 మధ్య ట్రేడ్‌ చేయండి. ఈ రేంజ్‌కు దిగువన లేదా పైన ట్రేడ్‌ చేయొద్దు. అన్ని రకాల టెక్నికల్‌ సూచీలు నిఫ్టి ఓవర్‌ బాట్‌ పొజిషన్‌లో ఉన్నట్లు చూపుతున్నాయి. స్వల్ప కాలానికి కూడా సెల్‌ సంకేతాలు చూపుతున్నాయి.