For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ రాత్రికి అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ మీటింగ్‌ ఉంది. ఫెడ్‌ నిర్ణయం కోసం ప్రపంచ మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లన్నీ రెడ్‌లో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.7 శాతం నష్టంతో ముగిసింది. డాలర్‌ స్థిరంగా ఉన్నా.. క్రూడ్‌ ఆయిల్‌ జెట్‌ స్పీడ్‌తో పెరుగుతోంది. ఇక ఉదయం నుంచి ఒక్రటెండు తప్ప ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. చైనా, న్యూజిల్యాండ్‌ అరశాతపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇతర మార్కెట్ల నష్టాలు నామ మాత్రంగా ఉన్నాయి. ముఖ్యంగా జపాన్‌, హాంగ్‌సెంగ్‌ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టి కూడా నామ మాత్రపు నష్టాలతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌ సమయానికి నిఫ్టి స్వల్ప నష్టాల్లో ప్రారంభం కావొచ్చు.