For Money

Business News

అధికస్థాయిల వద్ద నిఫ్టి..నిలబడేనా?

ఇవాళ ఉదయం నిఫ్టి సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 60 పాయింట్ల లాభంతో 15.878 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. ఇది నిఫ్టికి ప్రధాన నిరోధక స్థాయి. 15,888 లేదా 15,910 ప్రాంతానికి వస్తే అమ్మండి. స్టాప్‌లాస్‌ మాత్రం 15,930. రిస్క్‌ తీసుకునే వారి ఇదే స్టాప్‌లాస్‌తో ఇపుడే షార్ట్‌ చేయొచ్చు. అదానీ షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి కన్పిస్తోంది. అదానీ పోర్ట్స్‌ కాస్సేపు గ్రీన్‌లో కన్పించినా.. మళ్ళీ క్షీణించింది. మిగిలిన షేర్లు స్వల్ప లాభనష్టాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి కన్నా మిడ్‌ క్యాప్‌ షేర్లలో కొనుగోళ్ళు బాగున్నాయి. బ్యాంక్‌ నిఫ్టి కూడా అరశాతం లాభంతో ఉంది. నిఫ్టిలో ఏకంగా 43 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. కాని నిఫ్టి అరశాతం కూడా లాభపడలేదు. అంటే అన్నీ నామ మాత్రమేపు లాభాలే అన్నమాట. అధిక స్థాయిల వద్ద కొనగోళ్ళు చేయొద్దు. అన్ని సాంకేతిక అంశాలు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,043.55 1.88
ఏషియన్‌ పెయింట్స్‌ 2,995.55 1.55
టాటా కన్జూమర్‌ 722.35 1.06
యూపీఎల్‌ 842.85 0.99
టెక్‌ మహీంద్రా 1,077.95 0.81

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కోల్‌ ఇండియా 158.55 -0.50
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,442.65 -0.34
ఎస్‌బీఐ లైఫ్‌ 983.25 -0.29
హిందాల్కో 394.05 -0.19
JSW స్టీల్‌ 727.85 -0.18