For Money

Business News

15,550పైన ముగిసిన నిఫ్టి

ఉదయం ఊహించినట్లే నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందింది. తొలి ప్రధాన అవరోధాన్ని కూడా అధిగమించింది.15,550పైన నిఫ్టి ముగియడం చూస్తుంటే జీడీపీ డేటాపై మార్కెట్‌కు ముందస్తు సమాచారం ఉందా అన్న అనుమానం వస్తోంది. చిన్న ఇన్వెస్ట్లు బుక్కయ్యారా అన్న అనుమానం ఉంది. క్యాష్‌ మార్కెట్‌, ఫ్యూచర్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీ గాంబుల్‌ ఆడుతున్నారు. ఇవాళ గేమ్‌ మొత్తం ఫ్రంట్‌లైన్‌, ఫ్యూచర్స్‌లో ఉన్న షేర్లలోనే జరిగింది. నిఫ్టి ఏకంగా ఒక శాతం దాకా పెరిగినా… మిడ్‌క్యాప్‌ సూచీ కనీసం కదలకపోవడంలో లోగుట్టు అదేనేమో! నిన్నటి ముగింపుతో పోలిస్తే నిప్‌టి 147 పాయింట్ల లాభంతో 15,582 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుమునుపు 15,600ని కూడా తాకింది నిఫ్టి. బ్యాంక్‌ నిఫ్టి కూడా శాతం పెరిగింది. మెటల్స్‌ కూడా. మొత్తానికి దిగువ స్థాయిలో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు నిఫ్టి మంచి లాభాలనే ఇచ్చింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
JSW స్టీల్‌ 712.20 3.25
ఐసీఐసీఐ బ్యాంక్‌ 662.35 3.00
రిలయన్స్‌ 2,153.50 2.80
భారతీ ఎయిర్‌టెల్‌ 536.00 2.37
టాటా స్టీల్‌ 1,127.05 2.13

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఎం అండ్‌ ఎం 809.00 -4.36
అదానీ పోర్ట్స్‌ 769.15 -0.90
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 665.20 -0.56 ఐఓసీ 109.35 -0.46
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,014.80 -0.45