For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లన్నీ నిస్తేజంగా ఉన్న మన మార్కెట్లు స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలన్నీ రెడ్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ, చైనా మార్కెట్లు అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతుండగా, హాంగ్‌సెంగ్‌ గ్రీన్‌లో ఉన్నా లాభాలు నామ మాత్రమే. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 45 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.