For Money

Business News

అక్టోబర్‌కల్లా హైదరాబాద్‌కు 5జీ సర్వీసులు

ఈ ఏడాది అక్టోబర్‌కల్లా దేశంలోని 13 ప్రధాన నగరాలకు 5 జీ సర్వీసులు అందనున్నాయి. 5జీ స్ప్రెక్టమ్‌ వేలం తరవాత కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిదశలో 5జీ సర్వీసు అందే నగరాల్లో అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీఘడ్‌, చెన్నై, ఢిల్లీ, గాంధీ నగర్‌, గుర్‌గావ్‌, హైదరాబాద్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణెలకు అందిస్తారు. మొత్తం 72.098 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ వేలం వేయగా 51.236 మెగాహెడ్జ్‌ అమ్మినట్లు మంత్రి చెప్పారు. మొత్తం 40 రౌండ్ల వేలం తరవాత ప్రభుత్వానికి రూ. 1.5 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపారు.