For Money

Business News

13 నుంచి మెడ్‌ప్లస్‌ ఐపీఓ

హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. రూ.1,398 కోట్లు సమీకరించేందుఉ కంపెనీ పబ్లిక్‌ చేస్తోంది. రూ.2 ముఖవిలువ గల ఒక్కో షేరు ధర శ్రేణిని రూ.780-796గా నిర్ణయించారు. కనీసం 18 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాలి. ఇష్యూలో రూ.600 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుండగా, రూ.798.30 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద భాగంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు అమ్ముకుంటున్నారు. రూ.5 కోట్ల విలువైన షేర్లను సంస్థ ఉద్యోగులకు కేటాయించనున్నారు. వీరికి షేరుపై రూ.78 చొప్పున రాయితీ ఇస్తున్నారను.ఇష్యూ నిధులను మూలధన అవసరాలు, వ్యాపార విస్తరణ కోసం వినియోగిస్తామని కంపెనీ అంటోంది.