For Money

Business News

క్రూడ్‌ ఆయిల్‌ మళ్ళీ @ 76

ఒమైక్రాయాన్‌ భయాలు తగ్గడంతో క్రూడ్‌ దూసుకుపోతోంది. ఈ ఒక్క రేజే అంతర్జాతీయ మార్కెట్‌ క్రూడ్‌ నాలుగు శాతంపైగా పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 76.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒమైక్రాన్‌ కేసులు వెల్లడైనపుడు క్రూడ్‌ దాదాపు ఇదే స్థాయిలో ఉండేది. వారంలో తగ్గినట్లే తగ్గి… వెంటనే యధాస్థాయికి వచ్చేసింది. డాలర్‌ కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది. తాజాగా డాలర్ ఇండెక్స్ 96.44 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్‌లో వాడే WTI క్రూడ్‌ మరింత అధికంగా 4.65 శాతం లాభంతో 72.7 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి పెంచకపోవడం, డిమాండ్‌ జోరుగా ఉండటంతో డాలర్‌ బాగా పెరుగుతోంది. క్రిస్మస్‌ సందర్భంగా క్రూడ్‌కు మరింత డిమాండ్‌ వచ్చే అవకాశముంది.