For Money

Business News

దుమ్ము రేపుతున్న వాల్‌స్ట్రీట్‌

ఒమైక్రాన్‌ వేరియంట్‌ చాలా తక్కువ ప్రభావం కలదని అమెరికా వైద్య నిపుణుడు ఫౌసీ వెల్లడించడంతో షేర్‌ మార్కెట్‌లో సూచీలు దూసుకుపోతున్నాయి. గత కొన్ని వారాలు చాలా డల్‌గా ఉన్న నాస్‌డాక్‌ఇవాళ ఏకంగా మూడు శాతం లాభంతో ట్రేడవుతోంది. ఐటీ షేర్లలో వచ్చిన భారీ మద్దతు ప్రభావం ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలోనూ బాగా కన్పిస్తోంది. ఈ సూచీ కూడా రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇక డౌజోన్స్‌ కూడ ఆ 1.5 శాతంపైగా లాభపడటంతో… స్టాక్‌ మార్కెట్‌ ఉరకలు వేస్తోందనే చెప్పొచ్చు. యూరోపియన్‌ మార్కెట్లు కూడా ఇదే ట్రెండ్‌తో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 3.4 శాతం లాభంతో ముగిసింది. ఇక జర్మనీ డాక్స్‌ రికార్డు స్థాయిలో మూడు శాతం లాభపడింది.