For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టిలాగే నిఫ్టి క్రితం ముగింపు వద్దే ప్రారంభమైంది. పది గంటలకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియా సమావేశం ఉంది. అప్పటి వరకు నిఫ్టి స్వల్ప మార్పులతో స్థిరంగా ఉండే అవకాశముంది. నిఫ్టి ప్రస్తుతం 4 పాయింట్ల లాభంతో 15,694 వద్ద ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌ పర్లేదు. 0.3 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఆర్బీఐ ప్రసంగం తరవాత నిఫ్టి ఏమాత్రం క్షీణించినా కొనుగోలు చేయాలని టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. అయితే డే ట్రేడింగ్‌ కోసం కాకుండా పొజిషనల్‌ ట్రేడ్‌ కోసం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. డే ట్రేడర్స్‌ అధిక స్థాయిల వద్ద అమ్మి, స్వల్ప లాభాలతో బయట పడటం మంచిది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు 71 డాలర్లపైనే ఉండటంతో ఓఎన్‌జీసీ ఇవాళ మరో 3 శాతం పెరిగింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఓఎన్‌జీసీ 126.10 2.94
ఎల్‌ అండ్‌ టీ 1,524.00 0.87
ఎం అండ్‌ ఎం 808.55 0.81
ఏషియన్‌ పెయింట్స్‌ 2,959.00 0.81
టెక్‌ మహీంద్రా 1,020.50 0.61

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
JSW స్టీల్‌ 707.65 -0.90
ఐషర్‌ మోటార్స్‌ 2,745.00 -0.82
హిందుస్థాన్‌ లీవర్‌ 2,346.10 -0.73
నెస్లే ఇండియా 17,671.00 -0.72
హిందాల్కో 396.75 -0.61