For Money

Business News

BUY & SELL: రిలయన్స్‌, ఎస్కార్ట్స్‌, బీపీసీఎల్

పొజిషనల్‌ ట్రేడర్స్‌కు నిఫ్టి పాజిటివ్‌గా ఉంది. అనలిస్టులు 15,850-15,950 టార్గెట్‌ సూచిస్తున్నారు. ఇవాళ నిఫ్టికి దిగువస్థాయిలో మద్దతు లభిస్తుందేమో చూడాలి. నిఫ్టికి సపోర్ట్‌ లభిస్తుందని చాలా మంది టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఆకర్షణీయ లాభాలు గడించే అవకాశముంది. ఈ షేర్‌ను రూ. 2,180 స్టాప్‌లాస్‌తో రూ. 2,260 టార్గెట్‌గా కొనుగోలు చేయొచ్చు. బీపీసీఎల్‌ కూడా రూ. 494 చేరే అవకాశముంది. స్టాప్‌లాస్ రూ. 465. ఎస్కార్ట్స్‌ కూడా రూ. 1,275 టార్గెట్‌తో రూ. 1195 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. పొజిషనల్ ట్రేడర్స్‌ నిఫ్టిని 15,450 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని టెక్నికల్‌ అనలిస్ట్‌ మితేస్ టక్కర్‌ సలహా ఇస్తున్నారు. టార్గెట్‌ రూ. 15,850. బ్యాంక్‌ నిఫ్టిని కూడా 35,950 టార్గెట్‌ కోసం రూ. 35,150 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని సిఫారసు చేస్తున్నారు. ఇది పొజిషనల్‌ ట్రేడింగ్‌ కోసమే.