For Money

Business News

15,700పైన నిఫ్టి: అమ్మాలా? వొద్దా?

ఆర్బీఐ క్రెడిట్ పాలసీ, బ్యాంక్‌ నిఫ్టిని ఇవాళ గమనించండి. నిన్న కూడా నిఫ్టి రెండు వైపులా కదలాడుతోంది. అధిక స్థాయిలో అమ్మడం, దిగువ స్థాయిలో కొనుగోలు చేయడం రివాజుగా మారింది. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. టెక్నికల్స్‌ మాత్రం నిఫ్టిని ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా… నష్టాల్లో ఉన్నా, నిఫ్టి మాత్రం రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. నిన్న 15,700ని దాటినా.. దిగువనే క్లోజైంది. ఇవాళ కూడా నిఫ్టికి 15,650 కీలక స్థాయి. ఒకవేళ నిఫ్టి క్రితం ముగింపు వద్ద ఓపెనై… 15700ని దాటే పక్షంలో కాస్సేపు ఆగంది. నిఫ్టి ఏమాత్రం 15,750 ప్రాంతానికి వస్తే అమ్మండి. స్టాప్‌లాస్‌ 15,775. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,750 లోపలే అమ్మొచ్చు. ట్రేడ్‌ చేసే వారు ఆర్బీఐ పాలసీని గమనించండి. ఆర్బీఐ ఏమాత్రం నిరాశపర్చినా నిఫ్టి 15,600 ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 15,640 ప్రాంతంలో మద్దతు ఉన్నా… నిఫ్టి అక్కడ నిలబడుతుందేమో చూడండి. అధికస్థాయిలో అమ్మి, స్వల్ప లాభాలతో బయటపడండి. దిగువ స్థాయిలో కొనుగోలు..డే ట్రేడర్స్‌కు ఈ వారాంతంలో అనవసరం. ఆర్బీఐ పాలసీ నిరాశపరిస్తే.. బ్యాంకు షేర్లు పడినా.. మళ్ళీ మద్దతు అందే అవకాశముంది. జాగ్రత్త. నిఫ్టి అధికస్థాయిలో ఉంది, కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ అయిపోయింది. మార్కెట్‌కు ఉత్తేజం కల్గించే అంశాలు ఏమీ లేవు. అధికస్థాయిలో కొనుగోలు చేయడం అనవసరంగా రిస్క్‌ చేయడమే.