For Money

Business News

సర్వీసుల్లో సగం కోత

ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న స్పైస్‌జెట్‌ కంపెనీపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ఆంక్షలు విధించింది. ఈ సమ్మర్‌లో నడిపేందుకు ఆమోదం తెలిసిన సర్వీసుల్లో సగం తగ్గిస్తూ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 9వ తేదీ నుంచి జులై 13 డీజీసీఏ అధికారులు 53 చోట్ల చెక్‌ చేశారు. విమానాల మెయింటెనెన్స్ సరిగా లేదని డీజీసీఏ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జులై 5 మధ్యకాలంలో స్పైస్‌ జెట్‌ పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. దీనికి సంబంధించి స్పైస్‌జెట్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశామని… కంపెనీ సమాధానాన్ని ఈ నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో సమీక్షించినట్లు డీజీసీఏ పేర్కొంది. ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు తన సమాధానంలో పేర్కొందని, అయితే ఈ చర్యలు మున్ముందు కూడా కొనసాగాల్సి ఉందని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమోదించిన సమ్మర్‌ సర్వీసుల్లో 50 శాతం కోత విధిస్తున్నామని.. కంపెనీ తీసుకునే చర్యలను బట్టి అదనపు సర్వీసులను అనుమతించే అంశంలో డీజీసీఏ నిర్ణయం తీసుకుంటుందని ఉత్తర్వులో డీజీసీఏ స్పష్టం చేసింది.