For Money

Business News

రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేబినెట్‌ ఓకే

ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) పునరుద్ధరణకు ఉద్దేశించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఇవాళ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయిన ఈ కంపెనీ ప్రైవేట్‌ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను తయారు చేసేందకు ఈ ప్యాకేజీని ఉద్దేశించారు. అలాగే భారత్‌ బ్రాండ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేసే ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కంపెనీ సర్వీసులను మెరుగుపర్చడం, సంస్థ బ్యాలెన్స్‌షీట్‌పై ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఫైబర్‌నెట్‌ విస్తరణకు ఈ ప్యాకేజీని ఉద్దేశించినట్లు కేంద్ర ంతెలపిఇంది. ప్రస్తుతం కేంద్రానికి బీఎస్‌ఎస్‌ఎన్‌ ఇవ్వాల్సి ఉన్న రూ. 33000 కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చడానికి కేంద్రం అంగీకరించింది. అలాగే రూ.33000 కోట్ల విలువైన బ్యాంకు రుణాల స్థానంలో తక్కువ వడ్డీ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది.