వే2న్యూస్‌లో రూ.130 కోట్ల పెట్టుబడి
తెలుగులో తిరుగులేని షార్ట్ లోకల్ న్యూస్ యాప్ Way2Newsలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ 1.675 కోట్ల డాలర్ల (సుమారు రూ.130 కోట్లు) పెట్టబడి పెట్టింది. సిరీస్ ఏ రౌండ్ కింద ఈ నిధులను వే2న్యూస్ సమీకరించింది. ఇప్పటి వరకు తెలుగులో పూర్తి దృష్టి కేంద్రీకరించిన ఈ యాప్ ఇపుడు పొరుగు రాష్ట్రలైన కన్నడ, తమిళం, మలయాళం భాషలలో విస్తరించేందుకు ఈ నిధులను ఉపయోగించనుంది. ఇప్పటికే ఈ భాషల్లో న్యూస్ అందిస్తున్నా… తాజా పెట్టుబడులతో మరింత విస్తృతంగా ఆ మార్కెట్‌లోకి ప్రవేశించునుంది. ఎడిటోరియల్ సిబ్బందితో పాటు సేల్స్, మార్కెటింగ్ సిబ్బందిని పెంచుకోవడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధార టెక్నాలజీని పెంచుకునేందుకు ఈ నిధులను ఉపయోగిస్తామని కంపెనీ అంటోంది. విశ్వసనీయ వార్తలను అందించడంలో ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తోంది. మీడియాలో రంగంలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. తెలుగులో ఈనాడు గ్రూప్, టీవీ9తో పాటు పలు మీడియా సంస్థలు డిజిటల్ న్యూస్ రంగంలోకి వచ్చినా… విభన్నమైన శైలిలో వే2న్యూస్ దూసుకెళ్ళింది. 2016లో ప్రారంభమైన వే2న్యూస్‌కు నెలకు 800 కోట్ల నెలవారీ స్క్రీన్ వ్యూస్ ఉన్నాయని కంపెనీ అంటోంది.
