For Money

Business News

లాభాల్లోకి యూబీఐ

మార్చితో ముగిసిన త్రైమాసికంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.1329.77 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది (2019-20) ఇదేకాలంలో బ్యాంక్‌ రూ.2,503.18 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.11,306.99 కోట్ల నుంచి రూ.20,025.99 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఏడాదికి అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం రూ.80,104.19 కోట్లు, పన్ను తర్వాత లాభం 2,905.97 కోట్లు ఉన్నాయి. 2019-20లో మొత్తం ఆదాయం రూ.42,491.91 కోట్లు, నష్టం రూ.2,897.78 కోట్లు నమోదయ్యాయి. స్థూల నిరర్ధక ఆస్తులు 14.59 శాతం నుంచి 13.74 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 5.22 శాతం నుంచి 4.62 శాతానికి దిగివచ్చాయి.