For Money

Business News

మళ్ళీ బులియన్‌కు బలం

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంపై నెలకొన్న అనిశ్చితి ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై పడుతోంది. దీంతోపాటు కరెన్సీ మార్కెట్‌ కూడా ప్రభావితం అవుతోంది. తగ్గుముఖం పట్టినా క్రూడ్‌ ఆయిల్‌ వంద డాలర్లపైనే ఉంటోంది. ముఖ్యంగా డాలర్‌ ఇండెక్స్‌ 96.70 వద్ద పటిష్ఠంగా ఉండటంతో బంగారం మళ్ళీ 1,900 డాలర్ల స్థాయిని దాటింది. తాజా సమాచారం మేరకు బంగారం 1,910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా ఎంసీఎక్స్‌లో బులియన్‌ పరుగులు తీసింది. అంతర్జాతీయంగా బంగారంతో పాటు డాలర్‌ పెరగడంతో… మన వద్ద ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కన్నా ఎక్కువ ధర పలుకుతాయి. ఏప్రిల్‌ నెల బంగారం కాంట్రాక్ట్‌ రూ.711 లాభంతో రూ.50,952 వద్ద ట్రేడవుతోంది. అలాగే ఏప్రిల్‌నెల వెండి కాంట్రాక్ట్‌ రూ.1025 పెరిగి రూ. 65,930 వద్ద ట్రేడవుతోంది. ఈ లాభాలన్నీ కేవలం యుద్ధ భయంతో వచ్చినవే. మరి ఇవి ఎంత వరకు నిలబడుతాయో చూడాలి మరి.