For Money

Business News

తేరుకున్న వాల్‌స్ట్రీట్‌

ఆరంభ నష్టాల నుంచి వాల్‌స్ట్రీట్‌ కోలుకుంది. జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, గోల్డమ్యాన్‌ శాక్స్‌ వంటి పలు బ్యాంకుల షేర్లు మూడు శాతం దాకా క్షీణించడంతో ఎస్‌ అండ్‌పీ 500 సూచీ కూడా భారీగా నష్టపోయింది. అలాగే డౌజోన్స్‌ కూడా. కాని నాస్‌డాక్‌ నష్టాలు ఆరంభం నుంచి తక్కువగానే ఉన్నాయి. అయితే ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ సూచీలు నష్టాలను పూడ్చుకున్నాయి. నాస్‌డాక్‌ గ్రీన్‌లో ఉండగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా గ్రీన్‌లోకి వచ్చే అవకాశముంది. రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో… ఆ దేశంతో భారీగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న పలు సంస్థల షేర్లు దెబ్బతిన్నాయి. అమెరికా, యూరప్‌, రష్యా దేశాలు ఒకరిపై మరొకరు ఆంక్షలు విధించుకోవడంతో… దీనికి సంబంధించి ఎవరిపై ఎంత ప్రభావం పడుతుందనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. దీంతో మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది.