For Money

Business News

భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !

దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్‌ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్‌తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్‌ల్యాబ్స్‌ రూ.2,860 కోట్లు, క్రెడ్‌ రూ.1,597 కోట్లు, రేజర్‌పే రూ.1,189 కోట్లు, క్రెడిట్‌బీ రూ.1,137 కోట్లు, ఆఫ్‌బిజినెస్‌ రూ.817 కోట్లు, భారత్‌పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్‌ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్‌మింట్‌ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్‌ ఇన్సూరెన్స్‌ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేశాయి.