For Money

Business News

పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై ట్యాక్స్‌ తగ్గింపు

పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఏవియేషన్‌ ఫ్యూయల్‌ షిప్‌మెంట్‌లపై వైండ్‌ ఫాల్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. దేశంలో రిఫైన్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌లపై కేంద్రం ఆయాచిత లాభంపై పన్ను విధించిన విషయం తెలిసిందే. క్రూడ్‌ దిగుమతి చేసుకుని మన దేశంలో రిఫైన్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఈ పన్ను విధించింది. డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుముతలపై లీటర్‌కు రూ.2 చొప్పున ఎగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోల్‌ ఎగుమతులపై లీటరుకు రూ.6 సుంకాన్ని విధిస్తుండగా.. దీన్ని పూర్తిగా ఎత్తివేశారు. దేశీయంగా తయారు చేసిన క్రూడ్‌ ఎగుమతులపై విధించిన పన్నును టన్నుకు రూ. 17000 లేదా 27 శాతం మేర తగ్గించింది. జూన్‌ 1న ఈ పన్నులు విధించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు అధికంగా ఉన్నాయి…
రిలయన్స్‌కు జాక్‌పాట్‌
పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఏటీఎఫ్‌ ఎగుముతలపై వైండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ తగ్గించే అంశాన్ని కేంద్ర పరిశీలిస్తోందని నిన్ననే బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది. దీంతో రిలయన్స్‌ నిన్న ఆకర్షణీయ లాభంతో ముగిసింది. ఇవాళ నిర్ణయం రావడంతో రిలయన్స్‌ షేర్‌ ఇవాళ భారీగా పెరిగే అవకాశముంది. అలాగే ఓఎన్‌జీసీ షేర్‌కు కూడా మద్దతు లభించే అవకాశముంది.