For Money

Business News

నిఫ్టి పెరిగితే అమ్మడమే కాని…

స్టాక్‌ మార్కెట్‌ చాలా అనిశ్చితిలో ఉంది. ద్రవ్యోల్బణ రేటు పెరగడం మార్కెట్‌కు పెద్ద మైనస్‌ పాయింట్‌. నిఫ్టి 15800పైన అంటే గరిష్ఠ స్థాయిలో ఉంది. రేపు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయాలు. కాని ప్లస్ పాయింట్ల విషయానికొస్తే …విదేశీ ఇన్వెస్టర్ల ఆకస్తి కొనసాగుతోంది. క్యాష్‌ మార్కెట్‌ కంటే ఎఫ్‌ అండ్‌ ఓ కేటగిరిలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా ట్రేడ్‌ చేస్తున్నారు. ఇది చాలా అత్యంత కీలక అంశం. రిలయన్స్‌తోపాటు ఐటీ షేర్లను నుంచి మార్కెట్‌కు మద్దతు అందే అవకాశముంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభమైనా.. నిఫ్టి ఇవాళ కూడా ఆల్గో ట్రేడింగ్‌కే పరిమితం కానుంది. నిన్న అదానీ షేర్లతో తీవ్ర గందరగోళం ఏర్పడినా… నిఫ్టి మాత్రం చాలా స్పష్టంగా ఆల్గో ట్రేడింగ్‌ పరిమితమైంది. 15600 వద్ద కోలుకుని 15800 వద్ద ముగియడం… టెక్నికల్‌ అనలిస్టులు ఊహించిందే. అంత గందరగోళంలోనూ పొజిషనల్‌ ట్రేడర్లకు ఎలాంటి లాభనష్టం లేదు. ఇవాళ కూడా నిఫ్టికి 15,747 అంత్యంత కీలకం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,811. నిఫ్టికి తొలి అవరోధం 15,871 వద్ద ఎదురు కానుంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,890-15,900 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. లేదంటే నిఫ్టి 15900ని టచ్‌ చేస్తుందేమో వెయిట్‌ చేయండి. మార్కెట్‌ మూడు చూస్తుంటే నిఫ్టి ఈ స్థాయికి రావడం కష్టమే. నిఫ్టిని షార్ట్‌ చేస్తే.. 15,747కి వస్తుందేమో చూడండి. ఈ స్థాయిని దాటి దిగువకు వచ్చినా 15,735 ప్రాంతంలో మరో మద్దతు ఉంది. ఈ స్థాయిలో కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాస్‌ 15,710. నిఫ్టి సాంకేతికంగా ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో ఉంది. అన్ని రకాల టెక్నికల్‌ సూచీలు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. మరి ఎపుడు పడుతుందనేది కచ్చితంగా చెప్పకపోయినా… అధిక స్థాయిలో కొనుగోలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.